iBomma Owner Ravi Background: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు iBomma నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో తీవ్రంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కూకట్‌పల్లి రెయిన్‌బో విస్టా అపార్ట్‌మెంట్‌లో రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అక్కడ నుంచి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రవికి సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.3 కోట్ల మొత్తాన్ని అధికారులు ఫ్రీజ్ చేశారు. ఇప్పటికే ఐ బొమ్మ, బప్పమ్ వెబ్‌సైట్లు బ్లాక్ చేయబడినట్లు తెలిపిన పోలీసులు, విచారణలో 1X Bet బెట్టింగ్ లింకులు ట్రేస్ చేయగా ఐ బొమ్మ సంబంధం బయటపడిందని వెల్లడించారు.
![]() |
| iBomma Owner Ravi Background |
పోలీసులకు సవాలు విసిరిన రవి - 14 రోజుల రిమాండ్
పోలీసులకు సవాలు విసిరిన తర్వాత కూడా తన్నెవరూ పట్టుకోలేరన్న ధీమాతో రవి వ్యవహరించినట్లు అధికారులు చెబుతున్నారు. నెదర్లాండ్స్ నుంచి కూకట్‌పల్లికి రావడానికి గల కారణాలను పోలీసులు లోతుగా పరిశీలిస్తున్నారు. నిన్న రవిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే విచారణ కోసం 7 రోజుల పోలీస్ కస్టడీ అవసరమంటూ అధికారులు కోర్టును అభ్యర్థించారు.
Also Read: కరీబియన్ దీవుల నుంచి ఐబొమ్మ నడిపిన రవి.. హైదరాబాద్‌లో అరెస్ట్!
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ - భారీ లావాదేవీలు బట్టబయలు
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసుల దర్యాప్తుతో ఇమ్మడి రవి నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఐ బొమ్మ వెబ్‌సైట్‌లో 1X Bet వంటి యాప్స్‌కు రెగ్యులర్ ప్రచారం వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నెలకు 35-40 లక్షల మంది ఐ బొమ్మలో సినిమాలు చూస్తుండటంతో, వీరిని బెట్టింగ్ యాప్స్ వైపు మళ్లించేందుకు రవి, యాప్ నిర్వాహకులతో డీల్స్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమోషన్ల ద్వారా రవి కోట్లలో సంపాదించాడని, రెండు వర్గాల మధ్య భారీ లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇంకా దాచిన డబ్బు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి పైరసీ కింగ్‌పిన్ వరకూ - ఇమ్మడి రవి ప్రయాణం
ఇమ్మడి రవి తొలి దశలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గానే కెరీర్ ప్రారంభించాడు. ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తిచేసిన అతను, నెదర్లాండ్స్ మరియు కరేబియన్ దీవులకు వెళ్లే ముందు హైదరాబాద్‌లో ER Infotech అనే సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపించాడు. కంపెనీకి CEOగా ఉన్న రవి, అక్కడి నుంచి Cloud fare, OTT సర్వర్లను హ్యాక్ చేసి పైరసీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.
ఐ బొమ్మ, ఇతర వెబ్‌సైట్లలో పైరసీ సినిమాలు అప్లోడ్
పైరసీ ద్వారా పొందిన సినిమాలను ఐ బొమ్మ, బప్పం, ఐ విన్, బప్పం టీవీ వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో ఇమ్మడి రవి అప్లోడ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాక, ఐ బొమ్మలో సినిమా చూసే ప్రేక్షకులను బెట్టింగ్ యాప్స్ వైపు మళ్లించేందుకు ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తున్నట్లు కూడా విచారణలో తేలింది.